మాకవరపాలెం మండలం బీమబోయినపాలెం గ్రామంలోని సమీప జీడి మామిడి తోటలో గురువారం మహిళా రైతులు వ్యవసాయ పనులు చేస్తున్న సమయంలో అటుగా వెళ్తున్న కొండచిలువ కంటపడింది. కొండచిలువను తిరగడం గమనించిన మహిళలు భయబ్రాంతులు లేకుండా సమయస్ఫూర్తిగా వ్యవహరించారు. సాహసం చేసి అందుబాటులో ఉన్న కర్ర సహాయంతో భారీ కొండచిలువను హతమార్చారు. ప్రమాదకరమైన భారీ కొండచిలువను మహిళ రైతులే స్వయంగా హతమార్చడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు.