విశాఖ ఉక్కు పరిరక్షణకై నిర్వహిస్తున్న ఆందోళన కార్యక్రమంలో భాగంగా.. అనకాపల్లి నాలులు రోడ్ల జంక్షన్ లో గల సిటీ కాంప్లెక్స్ వద్ద దీక్ష కార్యక్రమాలు బుధవారం ప్రారంభించారు. మూడు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమంలో సిపిఎం, ఏఐటియుసి నాయకులు పాల్గొన్నారు. వేలాదిమందికి ఉపాధి అందిస్తున్న విశాఖ ఉక్కును రక్షించాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో రాష్ట్రంలో గల అన్ని రాజకీయ పార్టీలు ముందుకు రావాలన్నారు.