శిక్ష సప్తాహ్ కార్యక్రమాల్లో భాగంగా చివరి రోజు సోమవారం కోటఉరట్ల మండలం, కె. వెంకటాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్నం విద్యార్థులకు శుభ సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశారు.దాతలు,ఉపాధ్యాయులు సొంత నిధులతో చికెన్ కర్రీ,బిర్యానీ,పులిహార, స్వీట్లు,పండ్లు సమకూర్చారు.హెచ్ఎం షేక్ అల్లావుద్దీన్ మాట్లాడుతూ అందరూ సమానం అనే భావన విద్యార్థుల్లో కలుగుతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.