టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ మరణ వార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ఆయన మంగళవారం ఉదయం మాజీ మంత్రి మృతి వార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రకటన విడుదల చేశారు. పార్టీ అభివృద్ధికి ఆయన అహర్నిశలు కృషి చేశారు. వారి మరణం పార్టీకి తీరనిలోటని వారి ఆత్మకు శాంతి కలగాలని కోరారు.