మనం అందరం ముద్దుగా పిలుచుకునే సత్యం మాస్టర్ మన మధ్య లేరనే వార్త తీవ్రంగా కలచివేసిందని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ పేర్కొన్నారు. ఈసందర్భంగా మంగళవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. మాస్టర్ మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. అనకాపల్లి పార్లమెంటు కూటమి అభ్యర్థిగా తాను మొదటిసారిగా రెడ్డి మాస్టారు ఆశీస్సులు తీసుకున్నానని తెలిపారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారన్నారు.