కేంద్ర రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్, ఎంపీ సీఎం రమేష్ దృష్టికి శనివారం సాయంత్రం పలు సమస్యలు వెల్లువెత్తాయి. అనకాపల్లి క్యాంపు కార్యాలయంలో జిల్లా ప్రజల నుండి రైల్వే తో పాటు పలు అర్జీలు స్వీకరించిన ఆయన వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. బాధితుల సమక్షంలోనే ప్రభుత్వాధికారుల దృష్టికి పలు సమస్యలు తీసుకువెళ్లి వాటిని పరిష్కరించాలన్నారు. జిల్లా బిజెపి అధ్యక్షుడు పరమేశ్వరరావు పాల్గొన్నారు.