కేంద్ర హోంశాఖ సంప్రదింపులు కమిటీ సభ్యులుగా అనకాపల్లి ఎం పి సీ. ఎం రమేష్ నియమితులయ్యారు. ఈ కమిటీకి చైర్మన్ గా అమిత్ షా వ్యవహరించనున్నారు. ఈ కమిటీలో సహాయ మంత్రులు తో పాటు 15 మంది లోక్ సభ, 13మంది రాజ్యసభ, ఇద్దరు ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉంటారు. ఈ మేరకు శుక్రవారం కేంద్రం నుండి అధికారిక ఉత్తర్వులు జారీ చేసినట్టు ఎంపి కార్యాలయం తెలిపింది. దీనిపై ఎం పి రమేష్ ప్రదానికి, హోమ్ మంత్రికి ధన్యవాదాలు తెలిపారు.