అనకాపల్లి నియోజకవర్గంలో ఆరు కోట్ల రూపాయలతో గ్రోయిన్లు, పంట నీటి కాలువల మరమ్మత్తులు చేస్తామని, అనకాపల్లి ఎమ్మెల్యే కొనకల్లు రామకృష్ణ, రాష్ట్ర అర్బన్ కార్పొరేషన్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ చైర్మన్ పిలా గోవిందు చెప్పారు. సాయంత్రం సాగునీటి సంఘాల ఎన్నికలపై కూటమి శ్రేణులతో అనకాపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం సాగునీటి రంగాన్ని నిర్వీర్యం చేసిందన్నారు.