పాడేరు: పాఠశాలలో టీచర్ లను నియమించాలి
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం వంటల మామిడి పంచాయతీకి చెందిన జోడూరు గ్రామంలోని నాన్ రెసిడెన్షియల్ స్పెషల్ ట్రైనింగ్ సెంటర్లో 28 మంది విద్యార్థులు విద్యాభ్యసిస్తున్నారు. సెప్టెంబర్ 10న మండల విద్యాశాఖ అధికారి జోడూరును సందర్శించి ఒక ఉపాధ్యాయుని నియమించారు, కానీ ఆ ఉపాధ్యాయుడు విధులకు హాజరు కావడం లేదు. ఆదివాసి గిరిజన సంఘం జిల్లా నాయకులు ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేశారు.