కొండవాగులో పడి గిరి బాలిక మృతి
అల్లురి జిల్లా కొయ్యూరు మండలం బూదరాళ్ల పంచాయతీ అత్యంత మారుమూల గోధుమలంక గ్రామానికి చెందిన పాంగి సన్యాసిరావు, కాసులమ్మ దంపతుల పెద్ద కుమార్తె 11 ఏళ్ళ హిందూజ కుటుంబీకులు ఇంట్లో లేని సమయంలో గ్రామ సమీపంలో గల కొండవాగు వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు గల్లంతైంది. కుమార్తె కనిపించకపోవడంతో ఆమె ఆచూకీకై కుటుంబీకులు గ్రామస్తులు వెతకడంతో బుధవారం సాయంత్రం బాలిక మృతదేహం కుటుంబీకులకు లభ్యమయింది.