భారత విద్యార్ధి ఫెడరేషన్ ( ఎస్ ఎఫ్ ఐ ) అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రధమ మహాసభలు పాడేరు పిఎంఅర్సి లో శుక్రవారం నిర్వహించారు. ఈ మహాసభ కు రాష్ట్ర నాయకులు ఎల్ జే నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని నూతన అధ్యక్ష, కార్యదర్శులుగా కె. కార్తిక్, పి. జీవన్ కృష్ణ లను కమిటీ సలహామేరకు ఎన్నుకుని శుభాకాంక్షలు తెలియజేశారు. ఎన్నికైన వారు విధ్యార్థుల సమస్యల పరిష్కారం కోసం మమ్మల్ని ఎన్నుకున్నాందుకు కృతఙ్ఞతలు తెలిపారు.