మాడుగుల: తగ్గించిన పాల ధరను పునరుద్ధరించాలి
విశాఖ డైయిరీ ఇటీవల తగ్గించిన పాల ధరను పునరుద్ధరించాలని ఏపీ రైతు సంఘం కోరుతుంది. ఈ మేరకు ఆదివారం రైతు సంఘం ప్రతినిధులు గండి నాయన బాబు, ఎస్ వి నాయుడు, శ్రీను తదితరులు మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తిని ఆయన స్వగృహంలో కలిసి వినతి పత్రం అందజేశారు. విశాఖ డైరీ యాజమాన్యం పాలు లీటర్ కి ఐదు రూపాయలు తగ్గించడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.