కె కోటపాడు లో స్వామి వివేకానంద విగ్రహ ఆవిష్కరణ

376பார்த்தது
కె కోటపాడు లో స్వామి వివేకానంద విగ్రహ ఆవిష్కరణ
స్వామి వివేకానంద ఆశయాలను ప్రతి ఒక్కరూ పాటించాలని స్థానిక ఎంపీపీ రెడ్డి జగన్మోహన్ అన్నారు. అనకాపల్లి జిల్లా, కె కోటపాడు లో శనివారము స్థానిక శ్రీ షిరిడి సాయిబాబా ఆలయం వద్ద ఏర్పాటుచేసిన శ్రీ స్వామి వివేకానంద విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి స్థానిక ఎంపీపీ రెడ్డి జగన్మోహన్ మరియు ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బి. ఈశ్వర్ రావు ముఖ్య అతిథులుగా పాల్గొని స్వామి వివేకానంద విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం ఏపీడబ్ల్యూజేఎఫ్ మాడుగుల అధ్యక్షులు యలమంచిలి ధర్మారావు, ఉపాధ్యక్షులు వేగి రామారావు, కుబిరెడ్డి సన్ని బాబు ( టైగర్) ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఎంపీపీ రెడ్డి జగన్మోహన్ వివేకానందకు పూలమాలలు వేసి వివేకానంద సూక్తులు ను నెమరు వేసుకున్నారు. భారతదేశ గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు తెలియజేసిన గొప్ప వ్యక్తి మరియు శక్తి స్వామి వివేకానంద అని జగన్మోహన్ అన్నారు. అదేవిధంగా ఈశ్వరరావు మాట్లాడుతూ ఏపీడబ్ల్యూజేఎఫ్ యూనియన్ ఆధ్వర్యంలో ఇంతటి చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు చాలా గర్వంగా ఉందని, అదేవిధంగా యూనియన్లకు అతీతంగా విలేకరి సోదరులు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని అన్నారు.

ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు వెంకటేష్ మాట్లాడుతూ కె. కోటపాడు ప్రెస్ క్లబ్ ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని చక్కటి కార్యక్రమాలు చేయాలని కొనియాడారు. స్వామి వివేకానంద గొప్పతనాన్ని విపులంగా స్థానిక వైస్ ఎంపీపీ సూర్య నారాయణ తెలియజేశారు. అదే విధంగా యువతకు ఆదర్శం స్వామి వివేకానంద అని దాట్ల శివాజీ రాజు అన్నారు. "స్వామి వివేకానంద సూక్తి - యువతకు స్ఫూర్తి" అనే పుస్తకాన్ని డేన్ స్వచ్ఛంద సంస్థ అధినేత దొగ్గ అచ్చం నాయుడు ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని ప్రతి ఒక్కరూ చదివి వివేకానంద ఆశయాలను పాటించాలని యువతకు పిలుపునిచ్చారు. అనంతరం సన్మాన కార్యక్రమాలు ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు నాయుడు, వివేకానంద యువజన సంఘం సెక్రటరీ భూపతి అప్పలరాజు, జనసేన పార్టీ నాయకులు కుంచా అంజిబాబు, నంబారు అప్పారావు, గజ్జి బాల గంగాధర్, యస్. వెంకటరావు, బోను సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி