అరుకు: రోడ్డు నిర్మించాలని కలెక్టర్ కు వినతి
గుమ్మ పంచాయితీ కర్రిగోడ, కడరేవు గ్రామాలకు రోడ్డు సౌకర్యాలు లేక స్థానిక ప్రజలు డోలీ మోతలకు గురై మార్గం మధ్యలోనే మరణిస్తున్నారని శుక్రవారం జిల్లా కలెక్టర్ కు జడ్పిటిసి గంగరాజు వినతిపత్రం అందించారు. ఆయా గ్రామాల్లో సందర్శించిన మండల అధికారులకు డోలీ మోతలే దిక్కు అయ్యాయని జడ్పిటిసి అన్నారు. ఫారెస్ట్ అనుమతులు ఇచ్చి రోడ్డు పనులు ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ ను కోరారు.