ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలలను భారత ప్రధానమంత్రి సెప్టెంబరు 5 -9 తేదీల మధ్య వర్చువల్ గా ప్రారంభిస్తారని ఐటిడిఎ పీఓ వి.అభిషేక్ స్పష్టం చేశారు. పెదబయలు మండలంలోని లకేపుట్టు గ్రామం వద్ద కేంద్ర ప్రభుత్వ నిధులు రూ. 20 కోట్ల వ్యయంతో నిర్మించిన ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాల, అరకులోయ మండలం మజ్జివలస గ్రామం వద్ద రూ. 20 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈఎంఆర్ఎస్ పాఠశాలల నిర్మాణ పనులను గురువారం పిఓ పరిశీలించారు.