అనంతగిరి బొర్రా గ్రామ సచివాలయంలో ఉపాధి హామీ క్షేత్ర సిబ్బంది ఆధ్వర్యంలో మంగళవారం మొక్కలను నాటి ఘనంగా "ప్లాంటేషన్ ఆఫ్ మదర్ " కార్యక్రమంను నిర్వహించారు. క్షేత్ర సిబ్బంది అప్పలరాజు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరు నేలతల్లి మీద బాధ్యతగా మొక్కలను నాటాలని వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు , బొర్రా సిహెచ్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.