వాటిపైనే ఫిర్యాదులు ఎక్కువ: పవన్

85பார்த்தது
వాటిపైనే ఫిర్యాదులు ఎక్కువ: పవన్
AP: రెవెన్యూ, పంచాయతీ, దేవాదాయ శాఖల పరిధిలోని ప్రభుత్వ భూముల ఆక్రమణలతో పాటు బలవంతపు భూసేకరణ ఘటనలపై తనకు ఎక్కువగా ఫిర్యాదులు అందుతున్నాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. శనివారం ఎక్స్ వేదికగా.. ‘ఆయా శాఖల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. బాధితులు, సంబంధిత శాఖల నుంచి ఇలాంటి ఫిర్యాదులు అందిన వెంటనే కలెక్టర్లు, పోలీస్ శాఖ చర్యలు తీసుకోవాలి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నా.’ అని పవన్ పోస్ట్ పెట్టారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி