వినాయక నిమజ్జన ఊరేగింపులో ఉద్రిక్తత (వీడియో)

79பார்த்தது
వినాయక నిమజ్జన ఊరేగింపులో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఊరేగింపులో ఏర్పాటు చేసిన సినిమా పాటల విషయంలో ఇరువర్గాల మధ్య వివాదం చెలరేగింది. వాదనలు పెరగడంతో ఒకరిపై ఒకరు రాళ్లతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం ఎల్బీచర్లలో జరిగింది. సమాచారం అందుకున్న మొగల్లూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను శాంతింపజేశారు. ఈ క్రమంలో కానిస్టేబుల్ రాజేష్‌కు గాయాలయ్యాయి.

தொடர்புடைய செய்தி