సంతనూతలపాడు మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబుకు వైసిపి పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి కీలక బాధ్యతలు అప్పగించారు. పలువురు వైసిపి సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో వాళ్లకు అండగా నిలిచేందుకు సుధాకర్ బాబుకు బాధ్యతలు అప్పగించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కార్యకర్తలకు సుధాకర్ బాబు అండగా ఉంటారని తెలిపారు. లీగల్ సెల్ ను సమన్వయం చేసుకుంటూ కేడర్ కు భరోసా ఇవ్వాలని జగన్ సూచించారు.