రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైసిపి రాష్ట్ర అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్ విమర్శించారు. ఒంగోలులోని వైసీపీ కార్యాలయంలో శుక్రవారం వారు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు పాలన పూర్తిగా గాడి తప్పి అరాచకం రాజ్యమేలుతుందని ఎద్దేవ చేశారు. ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రజలు అధికారం ఇచ్చారన్న తీరుగా బాబు పాలన సాగుతుందన్నారు. వ్యక్తిగత వ్యాపారాలు ఎవరికి లేవు? అని ప్రశ్నించారు.