చీమకుర్తి మండలం రామతీర్థం పరిసర ప్రాంతాలలో ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి, కంకర తరలిస్తున్న 7 వాహనాలను మైన్స్ అధికారులు సీజ్ చేశారు. చీమకుర్తి గ్రానైట్ క్వారీలకు చెందిన ఈ వాహనాలను శనివారం సీజ్ చేసి వాటిని ఏపిఎండిసి ఆఫీస్ ఆవరణలో ఉంచారు. ఈ సందర్భంగా మైన్స్ అధికారులు మాట్లాడుతూ అనుమతులు లేకుండా ఎలాంటి మట్టి కానీ, కంకర కానీ తరలించినట్లయితే వాహనాలను సీజ్ చేస్తామని వాహనదారులకు హెచ్చరించారు.