ఒంగోలులోని 20వ డివిజన్ లో శనివారం శ్రీనివాస కళ్యాణం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీనివాస కళ్యాణం మహోత్సవంలో పాల్గొనటం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే తెలిపారు. పండితులు, ఎమ్మెల్యేకు ఆశీర్వచనాలను అందజేసి తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు.