ఒంగోలు నగరంలోని వేమూరి ఫంక్షన్ హాల్ నందు ఆదివారం జరిగిన జంగమ కులస్తుల వనభోజన కార్యక్రమాలకు ఒంగోలు నియోజక వర్గ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్తీక వనభోజనాలు ఐక్యతను చాటుతాయని తెలిపారు. వనభోజనాలు కమ్యూనిటీలోని వారందరి మధ్య సఖ్యత, ఐక్యత నెలకొల్పేందుకు దోహదపడతాయన్నారు. జంగమ కులస్తుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాయన్నారు.