జిల్లాలో క్షేత్రస్థాయిలో నీటి సమస్య లేకుండా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం ఒంగోలులోని కలెక్టరేట్ లో నీటి సంరక్షణ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నీటి సంరక్షణకు జిల్లాలో చేపడుతున్న చర్యల గురించి అధికారులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. నీటి ఎద్దడిని అధిగమించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.