కంభంలోని వాసవి జూనియర్ కళాశాలలో విద్యార్థులకు శనివారం స్థానిక ఎస్సై నరసింహారావు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. సైబర్ నేరాల బారిన పడకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో విద్యార్థులకు ఆయన వివరించి చెప్పారు. మీకు చెప్పిన సూచనలు సలహాలు మీ తల్లితండ్రులకు తెలిపి వారు సైబర్ నేరాల బారిన పడకుండా చూడాలన్నారు. ఒకవేళ సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతే 1930 నంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని ఎస్ఐ తెలిపారు.