గిద్దలూరు పట్టణంలోని కుమ్మరాం కట్ట సెంటర్లో ప్రజల సౌకర్యం కొరకు మరుగుదొడ్లు నిర్మించారు. ప్రస్తుతం ఆ మరుగుదొడ్లు నిరుపయోగంగా మారాయి. అవసరాల నిమిత్తం పల్లె నుంచి చాలామంది పట్టణానికి అవసరాల నిమిత్తం వచ్చినప్పుడు మరుగుదొడ్లు లేక ప్రజలు తీవ్రమైన ఇబ్బందికు గురవుతున్నారు. లక్షల రూపాయలు ఖర్చు చేసి ప్రజాధనంతో నిర్మించిన మరుగుదొడ్లు నిరుపయోగంగా మారడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.