ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి మంగళవారం ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును విజయవాడ మినిస్టర్స్ క్వార్టర్స్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. గిద్దలూరు నియోజకవర్గ పరిస్థితులను వివరించి, వెలిగొండ ప్రాజెక్టును త్వరగా పూర్తిచేసి కరువు ప్రాంతమైన గిద్దలూరుకు సాగునీరు మరియు త్రాగునీరు అందించాలని మంత్రిని, ఎమ్మెల్యే అశోక్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.