ప్రకాశం జిల్లా గిద్దలూరు సర్కిల్ ఎక్సైజ్ సిఐగా జయ రావు సోమవారం ఎక్సైజ్ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. గతంలో ఆయన తిరుపతి జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సీఐగా విధులు నిర్వహించారు. ప్రస్తుతం గిద్దలూరు సర్కిల్ ఎక్సైజ్ సీఐగా బాధ్యతలు చేపట్టిన జయరావుకు సిబ్బంది పరిచయం చేసుకుంటూ శుభాకాంక్షలు తెలిపారు. కంభం సర్కిల్ ఎక్సైజ్ సీఐగా కొండారెడ్డి బాధ్యతలు చేపట్టనున్నారు.