ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం కాకర్ల గ్రామంలో బెల్ట్ షాపు ఏర్పాటు చేసుకొని మద్యం అమ్ముతున్న వ్యక్తిని మంగళవారం ఎస్సై సుదర్శన్ అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు వద్ద నుంచి 48 క్వార్టర్ల మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నామని ఎస్సై తెలిపారు. మద్యం అమ్ముతున్న వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లుగా సుదర్శన్ చెప్పారు. మద్యం విక్రయించడం లేదా అధిక మొత్తంలో తరలించడం నేరమని ఆయన ప్రజలను హెచ్చరించారు.