త్రిపురాంతకం మండలంలోని దూపాడు వద్ద జాతీయ రహదారి పై గురువారం అనంతపురం నుంచి విజయవాడ వైపు వెళ్తున్న లారీ గుంటూరు నుంచి కర్నూలు వైపు వెళ్తున్న లారీ దూపాడు వద్ద ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో అనంతపురానికి చెందిన డ్రైవర్ శివశంకర్ రెడ్డి, క్లీనర్ రాము కు తీవ్ర గాయాలై క్యాబిన్ లోనే ఇరుక్కు పోయారు. వాహనదారులు గంట పాటు శ్రమించి క్యాబిన్ లో నుంచి బయటకు తీసి వెంటనే ఆసుపత్రికి తరలించారు.