ఎన్డీఏ ప్రభుత్వం హయాంలో పల్లె పల్లెనా అభివృద్ధి జరుగుతుందని సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయ్ కుమార్ తెలిపారు. నాగులప్పలపాడు మండలంలోని అమ్మనబ్రోలు గ్రామంలో రూ. 50 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులను ఎమ్మెల్యే విజయ్ కుమార్ ఆదివారం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు.