కార్తీక మాసం సందర్భంగా శివాలయాలు శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. కార్తీక సోమవారం తెల్లవారుజామున నుండి భక్తులు శివుడిని దర్శించుకోవడానికి క్యూలు కట్టారు. చీమకుర్తిలోని మోక్ష రామలింగేశ్వర స్వామి దేవస్థానం, శ్రీ సాక్షి రామలింగేశ్వర స్వామి, నగరేశ్వర స్వామి దేవస్థానాలలో, శ్రీ హరిహర క్షేత్రాలలో భక్తులు స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. అధిక సంఖ్యలో మహిళలు వ్రతాలు చేస్తూ నోములు నోస్తున్నారు.