సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ ఆదివారం టిడిపి కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేశారు. రూ. 92, 737 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును పేర్నమిట్ట కు చెందిన బొమ్మినేని లక్ష్మీనారాయణకు అందజేశారు. ఎమ్మెల్యే విజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం ద్వారా రాష్ట్ర ప్రజలకు మరింతగా మెరుగైన సేవలు అందజేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.