నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలు ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ పాఠశాలను రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ చిట్టా విజయ్ ప్రతాప్ రెడ్డి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో వంటశాల ప్రొవిజన్స్ గదిని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. విజయ్ ప్రతాప్ పాఠశాలలోని విద్యార్థులతో మాట్లాడి ఆహార నాణ్యత గురించి, బోధన గురించి ఆరా తీశారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు.