ప్రకాశం జిల్లావ్యాప్తంగా 38 ఉన్నత పాఠశాలల్లో పని వేళలు మారుస్తూ డీఈఓ కిరణ్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు కింద మండలానికి ఒక ఉన్నత పాఠశాల చొప్పున 38 పాఠశాలలను సెలెక్ట్ చేసి సమయపాలన మారుస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఆయా పాఠశాలల్లో ఉదయం 9 గంటల నుండి 5 గంటల వరకు పని వేళలు పొడిగించామన్నారు. ఈనెల 20వ తేదీ నుండి 30వ తేదీ వరకు ముందస్తుగా ఈ టైమింగ్స్ అమలు చేయనున్నామని తెలిపారు.