భారీ వర్షాల నేపథ్యంలో నాగులుప్పలపాడు మండలం చదలవాడ రామన్న చెరువు కట్ట బుధవారం తెగింది. దీంతో 216వ జాతీయ రహదారిపైకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఈ విషయం తెలుసుకున్న కలెక్టర్ వెంటనే అక్కడికి చేరుకొని భారీ వర్షం లోనే చెరువు కట్టను పరిశీలించారు. సంబంధిత అధికారులతో చర్చించి పరిస్థితులను తెలుసుకున్నారు. ఎటువంటి ప్రమాదాలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.