నవంబర్ 4వ తేదీ నుండి చీమకుర్తి పట్టణంలో గనుల భద్రత వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లుగా గ్రానైట్ క్వారీల అధినేత చలవాడి బద్రి తెలిపారు. మంగళవారం తన కార్యాలయంలో బద్రి మాట్లాడుతూ చీమకుర్తి పరిసర ప్రాంతాల్లోని గ్రానైట్ క్వారీలో 22వ గనుల భద్రత వారోత్సవాలను నిర్వహణకు గనుల భద్రత రాష్ట్ర అధికారి జ్ఞానేశ్వర్ ముఖ్య అతిథిగా పాల్గొంటారన్నారు. గ్రానైట్ క్వారీల్లో భద్రత ప్రమాణాలు, నియమ నిబంధనలు పరిశీలిస్తారని వెల్లడించారు.