కొమరోలు: దుకాణాలను పరిశీలించిన సీఐ రామకోటయ్య
ప్రకాశం జిల్లా కొమరోలు పట్టణంలో దీపావళి సందర్భంగా ఏర్పాటుచేసిన దీపావళి టపాసుల దుకాణాలను బుధవారం గిద్దలూరు రూరల్ సీఐ రామకోటయ్య పరిశీలించారు. దుకాణదారులకు సూచనలు సలహాలు ఇచ్చారు. ముందు జాగ్రత్తగా దుకాణాల సమీపంలో ప్రతి దుకాణదారుడు రెండు నీళ్ల డ్రమ్ములు నీటితో నింపి ఉంచుకోవాలని సీఐ సూచించారు. నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే దుకాణాలను తొలగిస్తామని వ్యాపారులను రామకోటయ్య హెచ్చరించారు.