సామర్లకోట - కాకినాడ రోడ్డులోని ముత్యాలమ్మ విగ్రహం సమీపంలో వంతెన నిర్మాణ స్థలం వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువతీ తీవ్రంగా గాయపడింది. స్కూటీపై సామర్లకోటకు వస్తున్న మహిళా గోతిలో పడగా ప్రమాదం కాగా ఆమె తలకు తీవ్ర గాయ్యాలయ్యాయి. అటుగా వెళుతున్న మెడికల్ విద్యార్ది గాయపడిన యువతికి ప్రధమ చికిత్స అందించారు. రోడ్డు నిర్మాణం వద్ద గోతులు తవ్వడం, మట్టి వర్షానికి జారడం అంశాలతో ఈ ప్రమాదం జరిగింది.