తిరుపతి లడ్డులో కల్తీ నెయ్యి వాడకం జరిగిందంటూ సీఎం చంద్రబాబు కులమతాల మధ్య చిచ్చు రేపుతున్నారని మాజీ రుడా చైర్పర్సన్ మేడపాటి షర్మిల రెడ్డి అన్నారు. శనివారం రాజమండ్రిలోని దానవాయిపేటలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూటమి నాయకులు దేవుడిని రాజకీయాల్లోకి లాగారని ఆవేదన వ్యక్తం చేశారు.