పెడన పట్టణం బంటుమిల్లి మండలం చోరంపూడి గ్రామంలో జాలర్లకు లభించిన ఓ పీతపై అంతర్వేది లక్ష్మీనృసింహస్వామి రూపం కనబడటంతో శనివారం నాడు అందరూ ఆశ్చర్యపోయారు. గ్రామ శివారు వడ్ల గరువులో పెదసింగ్ నాగా శ్రీను, తండ్రి రొయ్యలు వేటకు వెళ్లగా ఓ పీతవింత గొలిపింది. అనంతరం వారు ఆ పీతను దైవంగా భావించి పూజలు నిర్వహించారు. ఇప్పటి వరకు ఇలాంటి వింత జరగకపోవడంతో, అందరూ పీతను వీక్షించి పూజిస్తున్నారు.