మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అక్రమ కట్టడాలు ధ్వంసం చేస్తుండగా పోలీసులు మోహరింపుతో టెన్షన్ వాతావరణం నెలకొంది. మచిలీపట్నం నగరంలో కుమ్మరి గూడెం మురుగు పోరంబోకు ఆక్రమించుకుని గత ప్రభుత్వంలో వందలాది మంది నిర్మాణం చేపట్టారు. మురుగు కాలవ పక్కనే ఉన్న ఈ నిర్మాణాలు ప్రమాదమని గ్రహించిన అధికారులు తొలగించాలని హెచ్చరికలు జారీ చేశారు. మున్సిపల్, రెవిన్యూ, పోలీస్ కట్టుదిట్టమైన ఏర్పాట్లతో ధ్వంసం చేస్తున్నారు.