విద్యార్థినులకు పోక్సో తదితర చట్టాలపై పోలీసు అధికారులు మంగళవారం అవగాహన కల్పించారు. తునిలోని పలు కళాశాలలో మహిళా రక్షక్ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక సిద్ధార్థ కాలేజ్, శ్రీ చైతన్య కాలేజీలో విద్యార్థులకు పట్టణ ఎస్ఐ విజయ్ బాబు, ఏఎస్ఐ జీవీవీఎస్ఎన్ చౌదరి మహిళా చట్టాలపై అవగాహన కల్పించారు. విద్యార్థినులకు ఏ విధమైన సహకారం కావల్సిన 112, 100 నంబర్లకు ఫోన్ చేయాలని, పోలీసులు తక్షణం స్పందిస్తారని తెలిపారు.