కొల్ కత్తాలో అత్యాచారానికి గురై మృతి చెందిన జూనియర్ డాక్టర్ కుటుంబాన్నికి న్యాయం చేయాలని కోరుతూ తుని ఏరియా ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది విధులు బహిష్కరించి శనివారం నిరసన తెలియజేశారు. స్థానిక ఏరియా ఆసుపత్రి ఎదుట నిరసన తెలియజేసి, నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ విధుల్లో ఉండే డాక్టర్లకు, సిబ్బందికి రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు పాల్గొన్నారు.