కాకినాడజిల్లా తుని మండలం తేటగుంట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం కూటమినేతలు సంబరాలు అంబరానంటాయి. రాష్ట్ర ప్రభుత్వం తుని ఎమ్మెల్యే యనమల దివ్యకు ప్రభుత్వ విప్ పదవి కేటాయించడం పట్ల పెద్ద ఎత్తున కేక్ కటింగ్ చేసి సంబరాలు చేసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబుతో పాటు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు యనమల రాజేష్, మోతుకూరి వెంకటేష్ తదితరులు ఈ సంబరాల్లో పాల్గొన్నారు.