మలికిపురం: పోక్సో చట్టంపై అవగాహన కల్పించిన ఎస్సై
ప్రతి మహిళ చట్టాలపై అవగాహన కల్పించుకోవాలని మలికిపురం ఎస్సై సురేశ్ పేర్కొన్నారు. మలికిపురం మండలం మలికిపురం ఏఎఫ్డీటీ జూనియర్ కళాశాలలో మహిళా సంరక్షణ అనే అంశంపై గురువారం జరిగిన సదస్సులో పోక్సో చట్టం గురించి అవగాహన కల్పించారు. ప్రస్తుతం సమాజంలో సోషల్ మీడియా వలన జరుగుతున్న పలు అనర్దాల కోసం వివరించారు. సమావేశంలో అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.