సఖినేటిపల్లి: 104 ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి వినతిపత్రం సమర్పణ
సఖినేటిపల్లి మండలంలో 104 ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు,ఎమ్మార్వో, ఎంపీడిఓ లకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ మూడు నెలలుగా జీతాలు అందక కుటుంబాలు గడవడం కష్టంగా మారిందని వాపోయారు. 2020 తర్వాత నియమితులైన డ్రైవర్లు, డీఈఓలకు జీవో నెంబర్ 7 ప్రకారం వేతనాలు ఇవ్వాలని కోరారు.