ప్రభుత్వ హాస్టల్ లలో మెనూ సక్రమంగా అమలు చేయాలని రాజోలు ఎమ్మెల్యే దేవ ప్రసాద్ వార్డెన్లకు సూచించారు. శనివారం రాత్రి ఆయన రాజోలు బాలురు హస్టల్ ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. హాస్టల్ లలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని ఆయన అన్నారు.