రాజోలు నియోజకవర్గ పరిధిలోని గ్రామాలలో కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ అలైన్మెంట్ కు సంబంధించి ఏ విధమైన సమస్యలు వచ్చిన పరిష్కారానికి తాను కృషి చేస్తానని ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ తెలిపారు. అమలాపురంలోని కోనసీమ జిల్లా కలెక్టరేట్ వద్ద కలెక్టర్ మహేష్ కుమార్ గురువారం నిర్వహించిన వివిధ శాఖల అధికారుల సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. రైల్వే లైన్ పనులు త్వరితగతిన పూర్తయ్యేందుకు సహకారనందిస్తానన్నారు.