అమలాపురం: అప్పుడు విద్యార్థి.. ఇప్పుడు మంత్రి
కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కు అరుదైన గౌరవం లభించింది. అమలాపురంలో తాను చదువుకున్న కళాశాలకే శనివారం ముఖ్య అతిథి హోదాలో హాజరైయ్యారు. శనివారం ఎస్. కె. బీ. ఆర్ కళాశాలలో 'చదువుల కోసం పని' కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు కేరింతలు కొడుతూ మంత్రికి స్వాగతం పలికారు. మంత్రి మాట్లాడుతూ. తాను చదువుతున్న కాలేజీకే మంత్రిగా రావడం గొప్ప అనుభూతి పొందాను అని తెలిపారు.